Ram Gopal Varma: నటాషా హార్దిక్ విడాకులపై వర్మ సెటైర్
Ram Gopal Varma: ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్య నాలుగేళ్ల పాటు కలిసున్నాక తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోతున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి విడాకులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేసారు. పెళ్లిళ్లు స్వర్గాల్లో నిర్ణయించబడతాయి అంటారు కానీ నిజానికి పెళ్లిళ్లు నరకాల్లో, విడాకులు స్వర్గాల్లో నిర్ణయించబడతాయని అన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెళ్లి చేసేంత సమయం పాటు కూడా కాపురాలు నిలుస్తున్నాయో లేదో అనే సందేహం కలుగుతోందని అన్నారు.