2024 Elections: రేణూ ఇప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు..?

Hyderabad: గ‌త ఎన్నిక‌ల్లో(elections) దారుణంగా ఓడిపోయిన జ‌న‌సేనాని(janasena) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan).. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లోనైనా(2024 elections) త‌న సత్తా చాటాల‌ని కృషిచేస్తున్నారు. ర్యాలీలు, రోడ్డు షోలు, ప్రెస్‌మీట్లు ఇలా ప్ర‌జ‌ల‌కు చేరువ‌కావ‌డానికి ఏదో ఒక విధంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు చ‌ర్చంతా ప‌వ‌న్ మాజీ భార్య రేణూ దేశాయ్(renu desai) గురించే. స‌రిగ్గా 2024 ఎన్నిక‌లు(2024 elections) రాబోతున్న స‌మయంలో రేణూ.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు రిప్లై ఇస్తూ వారిని తిట్టడం వెన‌క ఉన్న అంత‌రార్ధం ఏంటి అని ప‌లువురు విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. (2024 elections)

2019 ఎన్నిక‌ల(elections) స‌మ‌యంలోనూ రేణూ(renu desai).. ప‌వన్(pawan kalyan) ఫ్యాన్స్ నుంచి త‌న‌కు వేధింపులు వ‌స్తున్నాయ‌ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప‌వ‌న్ ఒక్క మాట చెప్తే ఫ్యాన్స్ త‌న జోలికి రాకుండా ఉంటార‌ని, కానీ ప‌వ‌న్(pawan kalyan) మాత్రం అస‌లు స్పందించ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇప్పుడు కూడా మా అన్న‌య్య కొడుకు అకీరాను అప్పుడ‌ప్పుడూ చూపిస్తుండండి అని ఓ అభిమాని అడిగినందుకు ర‌చ్చ చేసారు. నిజానికి అందులో త‌ప్పేమీ లేక‌పోయిన‌ప్ప‌టికీ కావాల‌ని ఇన్‌స్టాలో స్టోరీలు పెట్టి వార్త‌ల్లో నిలిచేలా చేస్తున్నార‌ని కొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (2024 elections)

అదేమి అంటే.. నేను కూడా స్పందించ‌కూడ‌ద‌నే అనుకున్నాను కానీ నా కొడుకు అకీరా పుట్టిన‌రోజు నాడు ఇలాంటి కామెంట్లు చేస్తే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను అని అంటున్నారు రేణు(renu). 2024 ఎన్నిక‌ల(2024 elections) నేప‌థ్యంలో రేణూ(renu desai) జ‌న‌సేన పార్టీకి(janasena party) యాంటీ క్యాంపెయిన్ చేస్తున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఈ ఐదేళ్ల‌లో లేని కోపం ఎన్నిక‌ల‌కు ముందే ఎందుకు వ‌చ్చింద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.