Spiritual: దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతం?
Spiritual: దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభం అని చాలా మంది భయపడుతుంటారు. నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతోందంటే దానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి మనం వాడే నూనె. రెండోది వత్తి క్వాలిటీ. ఇక మూడోది మనం వత్తి ఏ వైపు నిలబెడుతున్నాం అని. ఈ మూడు కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుంది. దాని వల్ల ఎలాంటి అశుభం జరగదు. ఇక దీపం మధ్యలో కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కానీ అశుభం కానీ జరగదని గుర్తుంచుకోండి.