Madan Mohan: విజయసాయి రెడ్డితో శారీరక సంబంధం ఉందని శాంతికుమారే చెప్పింది
Madan Mohan: తనకు విజయసాయి రెడ్డితో శారీరక సంబంధం ఉందని తన భార్య కలింగిరి శాంతికుమారే స్వయంగా చెప్పిందని వెల్లడించారు ఆమె భర్త మదన్ మోహన్. తనను వారం రోజుల పాటు అమెరికా నుంచి భారత్‌కు రప్పించుకుని విజయసాయి నుంచి రెండు కోట్ల డబ్బు బదిలీ చేయించిందని.. ఎందుకు అని అడిగితే సర్ ఫ్లాట్ కొనుక్కునేందుకు డబ్బు ఇచ్చారని చెప్పిందని మదన్ తెలిపారు.
మదన్ తెలిపిన వివరాలు
నా భార్యకు నాకు ఎలాంటి గొడవలు లేవు. కొన్నేళ్ల పాటు బాగానే ఉన్నాం. మాకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే. మగపిల్లాడి కోసం ప్రయత్నించాం. కానీ నేను అమెరికా నుంచి శాశ్వతంగా భారత్‌కు వచ్చేసాక మరో బిడ్డ కోసం ప్రయత్నించచ్చు అనుకుని నేను వెళ్లిపోయాను. ఆ తర్వాత నన్ను 2023లో ఒక వారం రోజుల పాటు ఇండియాకి రావాలని శాంతి తెలిపింది. ఎందుకు అని అడిగితే వస్తే చెప్తా అనింది. నేను సరే అని వెళ్లాను. అప్పుడు విజయసాయి గారు మనకు రూ.2 కోట్లకు ఒక ల్యాండ్ ఇప్పిస్తానని అన్నారు అని చెప్పింది. అలా నేను ఆయన ఇచ్చిన డబ్బును బదిలీ చేయించాను. ఆ తర్వాత వెళ్లిపోయాను.
నేను శాంతితో ఉన్న వారం రోజుల్లో ఆమెతో కలవాలనుకుని ఇప్పుడే వద్దనుకున్నాను. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయాను. మగ బిడ్డ పుట్టాడని తెలిసి నేను ఇండియా వస్తాను అంటే ఇప్పుడు వద్దు ఎటూ డిసెంబర్లో శాశ్వతంగా ఇండియా వస్తావు కదా అప్పుడే చూద్దువులే అని చెప్పింది. నేను కూడా సరే అన్నాను. అలా డిసెంబర్లో నేను శాంతి దగ్గరికి వెళ్లాను. బాబును దగ్గరికి తీసుకున్నాను. అప్పుడు శాంతి నాకు ఒక మాట చెప్పింది. ఈ బిడ్డను ఐవీఎఫ్ ద్వారా కన్నాను అని. ఇండియాలో భర్త ఉండగా అతని అనుమతి లేకుండా ఐవీఎఫ్‌కి ఒప్పుకోరు. అదెలా సాధ్యం అని అడిగాను. అప్పుడు విజయసాయి రెడ్డి ద్వారా కనాల్సి వచ్చిందని చెప్పింది.
ఎందుకు అని అడిగితే.. నాకు పిల్లలు లేరు ఒక బిడ్డను నీ ద్వారా కనాలని అనుకుంటున్నాను అని విజయసాయి చెప్పారని అనింది. అది కూడా నమ్మశక్యంగా లేదు. నాకు ఆధారాలు చూపించు అని పదే పదే అడిగితే.. అప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను విజయసాయి సర్‌తో శారీరక సంబంధం పెట్టుకున్నాను ఆయన ద్వారానే నాకు బిడ్డ కలిగాడు అని చెప్పింది.
సరే ఇక నేను నీతో కలిసి ఉండను అని శాంతికి చెప్పేసాను. కాకపోతే నాకు నా పిల్లలకు ఆర్థిక సాయం కావాలని కోరాను. ఎందుకంటే నేను ఈ విషయాన్ని విజయసాయితో చర్చిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. శాంతికి కూడా ప్రాణహాని ఉంది. మరి నేను నా పిల్లలు ఏమైపోవాలి? అందుకే ఈ పంచాయతీని మీడియా ముందుకు తెచ్చాను. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి. నాకు నా పిల్లలకు న్యాయం జరగాలన్నదే నా పోరాటం.