Viral News; భర్త కొడుతున్నాడని పోలీసులకు ఫోన్.. రేప్ చేయబోయిన పోలీస్
Viral News: ఓ పక్క భర్త కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫోన్ చేస్తే.. సాయం చేసేందుకు వచ్చిన పోలీసే ఆ మహిళపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ మహిళ తనను తన భర్త కొడుతూ ఇంట్లో నుంచి గెంటేయబోతుంటే ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే ఓ పోలీస్ అధికారి ఘటనా స్థలానికి చేరుకుని మహిళ భర్తను అరెస్ట్ చేసాడు. ఆ తర్వాత మహిళను లోపలికి వెళ్లాలని తానొచ్చి మాట్లాడతానని చెప్పాడు.
అలా ఆ అధికారి లోపలికి వెళ్లి తలుపులు వేసి మహిళ చెయ్యి పట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె కేకలు వేయడంతో 2000 డాలర్లు చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఆ అధికారి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ వేరే పోలీస్ అధికారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో తప్పుగా ప్రవర్తించిన అధికారిని అరెస్ట్ చేసారు.