Viral News: డ్రోన్ ద్వారా భార్య‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న భ‌ర్త‌

husband uses drone and catches wife red handed

Viral News: భార్య‌పై అనుమానంతో భ‌ర్త డ్రోన్ ఉప‌యోగించ‌గా.. అది రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టించింది. ఈ ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది. హుబేయ్ ప్రావిన్స్‌లోని షియాన్ ప్రాంతానికి చెందిన కిమ్ అనే వ్య‌క్తికి ఎప్ప‌టి నుంచో త‌న భార్యపై అనుమానంగా ఉంది. ఏడాది నుంచి కిమ్‌ను ప‌ట్టించుకోకుండా ఏద‌న్నా మాట్లాడితే చిరాకు ప‌డ‌టం తిట్ట‌డం వంటివి చేస్తోంది. దాంతో ఆమెకు మ‌రో వ్య‌క్తితో సంబంధం ఉందేమో అని కిమ్‌కి అనుమానం వ‌చ్చింది.

మాటిమాటికీ త‌న త‌ల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోతుండ‌డంతో ఆమె ఎక్క‌డెక్క‌డికి వెళ్తోందో తెలుసుకునేందుకు కిమ్ డ్రోన్ ఉప‌యోగించాల‌నుకున్నాడు. అలా డ్రోన్ ద్వారా త‌న భార్య కారు ఎక్కి ప‌ర్వ‌తాలు ఉన్న అట‌వీ ప్రాంతానికి వెళ్తోంద‌ని తెలుసుకున్నాడు. ఆ త‌ర్వాత కారు దిగి ఓ వ్య‌క్తి చెయ్యి ప‌ట్టుకుని ఓ గుడిసెలోకి వెళ్లడం డ్రోన్‌కి ఉన్న కెమెరా ద్వారా చూసాడు. 20 నిమిషాల త‌ర్వాత ఆమె మ‌రో వ్య‌క్తితో క‌లిసి తాను ప‌నిచేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత త‌న భార్య మోసం చేస్తోంద‌ని తెలిసి విడాకుల‌కు అప్లై చేసాడు. సాక్ష్యాలుగా త‌న వ‌ద్ద ఉన్న డ్రోన్ ఫుటేజ్‌ను కోర్టులో స‌మ‌ర్పించాడు. కోర్టు విచార‌ణ‌కు ఆదేశించ‌గా.. ఆమె అక్ర‌మ సంబంధం పెట్టుకుంది ఎవ‌రితోనో కాదు ఆమె ప‌నిచేస్తున్న ఫ్యాక్టరీ బాస్‌తోనే అని తెలిసింది.