Madan Mohan: నేను సెక్స్ పూర్తిగా చేయలేదు.. అలాంటప్పుడు ఎలా గర్భం దాల్చింది?
Madan Mohan: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి మాజీ భర్త మదన్ మోహన్ ఆమె గురించి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేసారు. తాను తన భార్యతో సెక్స్ చేస్తున్నప్పుడు పూర్తిగా ఇన్‌సర్షన్ చేయలేదని.. మధ్యలో వద్దనుకున్నామని అన్నాడు. ఆ తర్వాత అతను పని మీద అమెరికా వెళ్లిపోయానని.. ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసి గర్భం దాల్చానని చెప్పిందని అన్నాడు. అదేంటి శాంతి మనం వద్దనుకున్నాం కదా గర్భం ఎలా దాల్చావు అని అడిగితే.. ఇంకోసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతా అందని ఆరోపించాడు.
ఆ తర్వాత ఆ బిడ్డ తనకు పుట్టబోయే బిడ్డ అని నమ్మానని.. కానీ ఇటీవల శాంతితో శృంగారం చేయడానికి ముందే ఆమె 10 వారాల గర్భిణి అని తెలిసిందని అన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తనను అమెరికా నుంచి వచ్చి చూడద్దు అనేదని.. ఆ తర్వాత నుంచి తనను ఎవాయిడ్ చేయడం మొదలుపెట్టిందని అన్నారు. ఇదెలా సాధ్యం అంటూ తన మాజీ భార్య గురించి మీడియా ముందు పడకగది విషయాలను పచ్చిగా వెల్లడించడం పట్ల తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు.