karnataka elections: రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు బంపర్ ఆఫర్!
Bengaluru: కర్నాటక(karnataka) రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు(assemble polls) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్(congress), బీజేపీ(bjp)లు తమకు అధికారం కట్టబెడితే.. అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటూ.. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఇక మేము పక్కా లోకల్ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు జేడీఎస్(jds) నాయకులు. కర్నాటకలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే సామర్థ్యం జేడీఎస్‌కు లేకపోయినప్పటికీ.. గెలుపోటములు, హంగ్ తీసుకొచ్చే పార్టీగా పేరుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అధినాయకుడు ప్రజల మధ్యనే ఉంటూ.. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే జేడీఎస్ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. అటు ముస్లింలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాలు(special schemes)అందజేస్తామని హామీలు ఇస్తున్నారు.
ఇక తాజాగా జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమార స్వామి(hd kumara swamy) ఓ వినూత్న పథకాన్నీ తీసుకొచ్చారు. రైతు కుంటుంబానికి చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది. కోలార్(kolar)లోని పంచరత్న ర్యాలీలో పాల్గొన్న కుమార స్వామి ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. రైతుల పిల్లల(farmers)కు పెళ్లిళ్లు(marrieages) జరిగేలా ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రైతుల పిల్లలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఏర్పాటైతే.. రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. ఇక కర్నాటకలో అధిక శాతం రైతు కుటుంబాలే ఉంటాయి. వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని కుమారస్వామి తీసుకొచ్చారని అందరూ భావిస్తున్నారు.