Anant Radhika Wedding: నెల‌కు క‌రెంట్ బిల్లు ఎంతో తెలుసా?

know the current bill of antilia amid Anant Radhika Wedding

Anant Radhika Wedding: మ‌హారాష్ట్ర మొత్తంలో అత్యంత ఖ‌రీదైన భ‌వ‌నం ఏదైనా ఉందంటే అది ముఖేష్ నీతా అంబానీ దంప‌తుల‌కు చెందిన ఆంటీలియా. 27 అంత‌స్తుల ఈ భ‌వ‌నం ఖ‌రీదు రూ.15 వేల కోట్లు. ముంబైలోని బాంద్రాలో ఉంది ఈ భ‌వ‌నం. అయితే.. ఈ భ‌వ‌నానికి స‌ప్లై చేసే విద్య‌త్తుతో 7 వేల మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌కు స‌రిప‌డా క‌రెంట్ స‌ప్లై చేయొచ్చ‌ట‌.

ఇక అంబానీ దంప‌తులు త‌మ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చెంట్‌ల వివాహ వేడుక‌ల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు మూడు నెల‌లుగా వివాహ వేడుక‌ల పేరిట వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. అలా ఈ పెళ్లికి రూ.5000 కోట్లు ఖ‌ర్చు అయ్యాయి. ఇది వారికి చాలా అంటే చాలా చిన్న ఖర్చు. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం. ఇక అంబానీ ఇంటికి నెల‌నెలా వ‌చ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.70 ల‌క్ష‌లు. ఎందుకంటే ఆంటీలియా భ‌వ‌నం మొత్తం ప్ర‌తి నెలా 6,37,240 యూనిట్ల క‌రెంట్ వినియోగిస్తోంది.

ఇక అంబానీ ఇంట చిన్న వార‌సుడి పెళ్లి విష‌యానికొస్తే.. ఈరోజు వివాహ బంధంతో అనంత్, రాధిక‌లు ఒక్క‌ట‌య్యారు. రేపు శుభ్‌ ఆశీర్వాద్ పేరిట వివిధ అతిథుల నుంచి ఆశీర్వాద కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. ఈ నెల 14న మంగ‌ళ ఉత్స‌వంతో పాటు గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తారు. ఆరోజుతో అంబానీ ఇంట పెళ్లి వేడుక‌లకు ఎండ్ కార్డు ప‌డుతుంది.