Anant Radhika Wedding: చిన్న వారసుడి పెళ్లి.. ఖర్చు ఎంతో తెలుసా?
Anant Radhika Wedding: దాదాపు మూడు నెలలుగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహంతోనే ముంబై కళకళలాడిపోయింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడైన అనంత్ వివాహం నేపథ్యంలో.. ముంబైలోని బాంద్రా, కుర్లా ప్రాంతాల్లో పనిచేసే సాధారణ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారంటే ఏ రేంజ్లో పెళ్లి పనులు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.
దాదాపు ఐదు ప్రీ వెడ్డింగ్ పార్టీల తర్వాత ఎట్టకేలకు ఈరోజు అనంత్ రాధికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే.. ఈ పెళ్లికి అంబానీలకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.5000 కోట్లు. ఇది ప్రిన్సెస్ డయానా, చార్ల్స్ వివాహం కంటే ఎక్కువ. ప్రిన్సెస్ డయానా వివాహానికి అయిన ఖర్చు రూ. 1,361 కోట్లు. పెళ్లికి అయిన ఖర్చు రూ.2500 కోట్లు కాగా.. ప్రీ వెడ్డింగ్ పార్టీలకు అయిన ఖర్చు రూ.2500 కోట్లు. ఈ రకంగా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం ఇదే అని చెప్పాలి. మరి గిన్నీస్ రికార్డు వాళ్లేమన్నా అంబానీలను సంప్రదిస్తారేమో వేచి చూడాలి.