Viral News: 13 ఏళ్ల విద్యార్థికి నగ్న ఫోటోలు పంపుతూ..!
Viral News: స్కూల్లో కౌన్సిలర్‌గా పనిచేస్తున్న ముగ్గురు పిల్లల తల్లి.. 13 ఏళ్ల బాలుడికి తన నగ్న ఫోటోలు పంపి లైంగిక వేధింపులకు గురిచేసింది. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో చోటుచేసుకుంది. లూయిసా అనే 45 ఏళ్ల మహిళ.. స్కూల్లోని తన క్యాబిన్‌కి 13 ఏళ్ల బాలుడిని పిలిపించుకుని ఒడిలో కూర్చోపెట్టుకోవడం.. వాడికి తన నగ్న ఫోటోలు చూపించడం వంటివి చేసేది. ఓసారి ఆ బాలుడి స్నేహితుడు ఫోన్ చూడగా.. అందులో అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్‌లు చూసి షాకయ్యాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది.
వెంటనే వారు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దాంతో పోలీసులు ఆమెపై రెండో డిగ్రీ నేరం కింద కేసు నమోదు చేసారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. 500,000 డాలర్లు చెల్లించి బెయిల్ తెచ్చుకుంది.