USA: మోదీ రష్యా పర్యటన.. ముఖం మాడ్చుకున్న అగ్రరాజ్యం
USA: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించింది. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన తన ప్రియ మిత్రుడైన మోదీతో చాలా విషయాల గురించి చర్చించారు.
అయితే మోదీ రష్యాలో పర్యటించడం పట్ల అగ్రరాజ్యం అమెరికా ముఖం మాడ్చుకుంది. ఎందుకంటే మోదీ నాటో సమ్మిట్ జరుగుతున్న సమయంలో రష్యాలో పర్యటించారు. ఈ నాటో సమ్మిట్‌లో భాగంగానే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. ఇలా మోదీ రష్యాకు వెళ్లడంతో అమెరికాకు భారత్‌కు మధ్య సత్సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని అమెరికన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోదీ రష్యాకు పర్యటిస్తున్నారని తెలిసినప్పుడు అమెరికన్ డిప్యూటీ సెక్రటరీ అయిన కుర్ట్ క్యాంప్‌బెల్.. భారత్‌కు చెందిన విదేశీ సెక్రటరీ అయిన వినయ్ క్వాత్రాకు లేఖ పంపారు. ఆ లేఖలో మోదీ రష్యా పర్యటనను రీషెడ్యూల్ చేసుకోవాలని ఉంది. అయినా కూడా వారు రీషెడ్యూల్ చేయలేదు. అనుకున్న సమయానికే మోదీ రష్యా వెళ్లారు. దాంతో అగ్రరాజ్యం గుర్రుమంది. అసలు భారత్‌కు రష్యాపై మరీ ఎక్కువగా ఆధార పడాల్సిన అవసరం లేదని.. రేపు ఏదన్నా సమస్య వస్తే రష్యా భారత్‌కు కాకుండా చైనాకు మద్దతు తెలిపే ప్రమాదం రాకపోదని అమెరికన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.