Lavanya: ప‌వ‌న్‌కి కూడా 3 పెళ్లిళ్లు అయ్యాయి.. నాకు న్యాయం ఆయ‌నే చేస్తారు

raj tarun's lover says she will reach out to pawan kalyan for justice

Lavanya: త‌న‌కు న్యాయం చేయ‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు వెళ్తానని అన్నారు ప్ర‌ముఖ న‌టుడు రాజ్ త‌రుణ్ ప్రేయ‌సి లావ‌ణ్య చౌద‌రి. ప‌వ‌న్ ఆఫీస్‌కి వెళ్లి త‌న‌కు న్యాయం చేయ‌మ‌ని అడుగుతాన‌ని… ఆయనకీ కూడా 3 పెళ్లిళ్లు అయ్యాయి కానీ ఆయన తన త‌న‌ భార్య‌ల‌కి ఏం ఇవ్వకుండా వదిలెయ్యలేదు కదా అని అంటున్నారు. ఈ విష‌యంలో త‌న‌కు ప‌వ‌న్ సాయం చేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

రాజ్ త‌రుణ్ త‌న‌తో 11 ఏళ్లు కాపురం చేసి ఇప్పుడు మ‌రో హీరోయిన్ కోసం త‌న‌ను వ‌దిలేసాడ‌ని నార్సింగ్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు వేసింది లావ‌ణ్య‌. రెండు రోజుల త‌ర్వాత పోలీసులు రాజ్ త‌రుణ్‌పై కేసు న‌మోదు చేసారు. మ‌రోప‌క్క రాజ్ త‌రుణ్ లావ‌ణ్య వ‌ల్ల తాను ఎంతో న‌ష్ట‌పోయాన‌ని.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని అంటున్నాడు. లావ‌ణ్య‌కు డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉంద‌ని.. ఓసారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లింద‌ని తెలిపాడు. దాంతో నార్సింగి పోలీసులు ఈ కేసుపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.