Thala for a reason: ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎవ‌రో తెలుసా?

do you know who started Thala for a reason trend

Thala for a reason:  సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ 7 అనే నెంబ‌ర్ క‌నిపించినా త‌లా ఫ‌ర్ ఎ రీజ‌న్ అని కామెంట్ పెట్టేస్తుంటారు. అస‌లు ఈ త‌లా ఫ‌ర్ ఎ రీజ‌న్ అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు.. ధోనీ శిష్యుడు రుతురాజ్ గైక్వాడ్. అదెలాగంటే.. రుతు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. T20I క్యాప్ మీద 88 అని రాసున్న పోస్ట్ పెట్టాడు. అంటే T20I క్రికెట్‌లో రుతు 88వ ఆట‌గాడ‌ని అర్థం.

దీనిపై రుతు స్పందిస్తూ.. త‌న‌ది 88వ నెంబ‌ర్ అంటే.. 8+8=16. 16లో 1+6 అంటే 7. త‌ల ఫ‌ర్ ఎ రీజ‌న్. అంటే ఫ్యాన్స్ అంద‌రికంటే ముందు ఈ త‌లా ఫ‌ర్ ఎ రీజ‌న్ అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది నేనే అని రుతు స‌గ‌ర్వంగా చెప్పుకుంటున్నాడు.