Mukesh Ambani: అంబానీ ఆస్తులు ఖర్చు చేయడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
Mukesh Ambani: ఇప్పుడు ఎక్కడ చూసినా అంబానీ అంబానీ అంబానీ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి. రాధికా మర్చెంట్ అనంత్ అంబానీల పెళ్లి వేడుక రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలలుగా గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్కో సెలబ్రేషన్‌కు అయ్యే ఖర్చు ఎంతకాదన్నా రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వారికి రూ.500 కోట్లు 5 కోట్లతో సమానం. ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన అంబానీ ఆస్తుల విలువ రూ. 1,02,11,37,73,00,000. అంటే దాదాపు రూ.10.21 లక్షల కోట్లు. పైగా ఈ ఏడాదిలో ఆయన ఆస్తులు రూ.1.5 లక్షల కోట్లు పెరిగాయి.
మరి ఆయన ఆస్తి మొత్తం తరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? 900 సంవత్సరాలు. అంబానీ రోజుకు రూ.3 కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తి మొత్తం అయిపోవాలంటే 10 శతాబ్దాల సమయం పడుతుందట. అంటే దాదాపు 340379 రోజుల పాటు రోజుకు రూ.3 కోట్లు ఖర్చు పెట్టాలన్నమాట.