KTR: ఈ న‌గ‌రానికి ఏమైంది?

ktr worries about crimes in hyderabad

KTR: ఈ హైద‌రాబాద్ న‌గ‌రానికి ఏమైంది అని ప్ర‌శ్నిస్తున్నారు భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్క‌డ చూసినా దోపిడీలు హ‌త్య‌లు ప‌ట్ట‌ప‌గ‌లే జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. న‌గ‌రంలో లా అండ్ ఆర్డ‌ర్ ఏమైంది అని ప్ర‌శ్నించారు.

ఈ మహా నగరానికి ఏమైంది..? ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?” అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తున్నాయి. అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం! పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోంది!

“బ్రాండ్ హైదరాబాద్”
ఎందుకు మసకబారుతోంది ??
విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ..
ఎందుకింత కళ కోల్పోతోంది ???

సగటు హైదరాబాదీకి
కలుగుతున్న భావన ఇది..!
హైదరాబాద్ ను ప్రేమించే
ప్రతిఒక్కరిలో ఉన్న ఆవేదన ఇది..!!

పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో
పెరిగిపోతున్న వరుస హత్యలు..
పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు..

రాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు..
నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు..

సీఎం గారు స్వయంగా…
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా..
పోలీసింగ్ పై కమాండ్ ఏది..?
క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది..??

ఓవైపు..
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం..
పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.

మరోవైపు..
పడగవిప్పిన హత్యల సంస్కృతి..
ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోంది.

ఇంకోవైపు..
తరలిపోతున్న పెట్టుబడుల పర్వం..
యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోంది.

కాంగ్రెస్ పవర్ లోకి రాగానే
గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ ?

సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో..
ఎందుకు పెరుగుతోంది.. క్రైం రేట్ ??
ఇదేనా మీరు తెస్తానన్న మార్పు ?

విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి..
పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే..
అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా ?

ప్రపంచంతో పోటీపడే నగరంగా
ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి
అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ??

దేశ రాజధాని చుట్టూ..
రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ..
చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న
రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ???

హైదరాబాద్ అంటే..
కేవలం రాజధాని కాదు..
“తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ ”

ఇకనైనా..
కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే..
మన హైదరాబాద్ దెబ్బతింటే..
రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం..