Perfume: పెర్ఫ్యూం ఎక్కువ సేపు నిల‌వ‌డంలేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

tips for last longing perfume smell

Perfume: చాలా మందికి ర‌క‌ర‌కాల సెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వాడ‌టం అంటే చాలా ఇష్టం. కానీ మ‌నం కొట్టుకున్న పెర్ఫ్యూం వాస‌న రాదు కానీ వేరే వారి నుంచి మాత్రం మంచి సువాస‌న‌లు వ‌స్తుంటాయి. అలా ఎందుకంటే.. మ‌నం శ‌రీరంలో పెర్ఫ్యూమ్ వాడాల్సిన చోట త‌ప్ప అన్నీ చోట్లా కొడుతుంటాం. మ‌రో విష‌యం ఏంటంటే.. కొంద‌రు స‌మ‌యం సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా లేని సెంట్లు వాడుతుంటారు. దీని వ‌ల్ల మీ చుట్టుప‌క్క‌ల వారు ఇబ్బంది ప‌డ‌తారు. ముఖ్యంగా ఆఫీస్ లాంటి ప్ర‌దేశాల్లో.  మీ పెర్ఫ్యూం లేదా సెంట్ వ‌ల్ల ఇత‌రుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా.. మీ నుంచి వ‌చ్చే సువాస‌న‌కు ఫిదా అయిపోయేందుకు ఈ టిప్స్ పాటించండి.

మార్కెట్‌లో ల‌క్ష‌లాది పెర్ఫ్యూమ్‌లు సెంట్లు ఉన్నాయి. మీకు కేవ‌లం ఒకే ఒక్క సెంట్ న‌చ్చితే అదే వాడుకోండి. లేదూ.. ఏద‌న్నా కొత్త‌ది ట్రై చేయాల‌నుకుంటే మాత్రం షాప్స్ లేదా మాల్స్‌కి వెళ్లి మాత్ర‌మే కొనుక్కోండి. ఎందుకంటే మ‌నం స్వ‌యంగా వాస‌న చూసి న‌చ్చితేనే తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో రివ్యూలు బాగున్నా కూడా ఆ వాస‌న మీకు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి స్వ‌యంగా వెళ్లి వాస‌న చూసి మ‌రీ కొనుక్కోండి. కొన్ని ర‌కాల షాపుల్లో సెంట్లు లేదా పెర్ఫ్యూమ్‌లు మీకు న‌చ్చిన‌ట్లుగా త‌యారుచేస్తుంటారు. మీకు రెండు బ్రాండ్ల స్మెల్ బాగా న‌చ్చిందనుకోండి.. ఆ రెండూ క‌లిపి ఒక పెర్ఫ్యూమ్‌గా చేసి ఇస్తారు. దాని సువాస‌న ఇంకా బాగుంటుంది. కాబ‌ట్టి ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి.

పెర్ఫ్యూమ్ లేదా సెంట్ల‌ను ఎక్క‌డ రాసుకోవాలి?

చేతి నాడిపై, మెడ‌పై, చెవుల వెనుక రాసుకోండి. వీటిని ప‌ల్స్ పాయింట్స్ అంటారు. వీటిపై రాసుకుంటే సువాస‌న రోజంతా వ‌స్తుంది.

ఎక్కువ‌గా రాసుకోవ‌ద్దు. రెండు మూడు స్ప్రేలు చాలు

దుస్తుల‌కు మాత్రం రాసుకోవ‌ద్దు. మ‌ర‌క‌లు ప‌డ‌తాయి. కేవ‌లం చ‌ర్మంపై రాసుకోండి.

వేడి వాతావ‌ర‌ణంలో తేలిక పాటి సెంట్లు, చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో కాస్త ఘాటుగా ఉన్న‌వి రాసుకోండి

చేతి నాడికి సెంటు రాయ‌గానే ర‌బ్ చేస్తుంటారు. అలా చేయ‌కండి

దెబ్బ త‌గిలిన చోట కురుపులు మొటిమ‌లు ఉన్న చోట అస్స‌లు రాయ‌కండి

వాడిన త‌ర్వాత చీక‌టిగా ఉండే పొడి ప్ర‌దేశంలో మీ సెంటు బాటిల్‌ను పెట్టండి. మూత టైట్‌గా పెట్టడం మాత్రం మ‌ర్చిపోకండి