PAN Aadhaar Linking: ఇంకా ప్యాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదా?

have you not linked your pan and aadhaar card yet

PAN Aadhaar Linking:  ప్యాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఎప్పుడో ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే చాలా మంది ఈ ప‌ని చేసేసారు. అయితే ఇంకా ప్యాన్ కార్డు ఆధార్ కార్డుని లింక్ చేసుకోని వారు ఉన్నారు. మ‌రి వారి ప‌రిస్థితేంటి? తొలి డెడ్‌లైన్‌ను మిస్స‌యిన వారికి రూ.500 పెనాల్టీ విధించారు. ఆ త‌ర్వాత 2022 జూన్ వ‌ర‌కు డెడ్‌లైన్‌ను పొడిగించారు. జూన్ త‌ర్వాత పెనాల్టీ రూ.1000కి పెంచారు.

ఆ త‌ర్వాత డెడ్‌లైన్‌ను మార్చి 2023కి పెంచారు. ఇలా ఎంత స‌మ‌యం ఇస్తున్నా పెనాల్టీ ఎంత పెంచుతున్నా ఇంకా లింక్ చేసుకోని వారు చాలా మందే ఉన్నారు. వీరికి ఇక ప్యాన్ కార్డు ప‌నిచేయ‌దు. ప్యాన్ కార్డు డీయాక్టివేట్ అవ్వ‌కుండా ఉండాలంటే రూ.1000 పెనాల్టీ క‌ట్టాల్సి ఉంటుంది. ఆల‌స్య రుసుముల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ఏకంగా రూ.2125 కోట్లు లాభ‌ప‌డింది. ఇలా పెనాల్టీ క‌ట్టుకుంటూ ఆధార్ ప్యాన్ కార్డులు లింక్ చేసుకోక‌పోతే ఏదో ఒక‌రోజు ప్యాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఒక‌వేళ డీయాక్టివేట్ అయితే ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన ప‌థ‌కాలు రావు. ఎలాంటి బ్యాంక్ లావాదేవీలు చేసుకోలేరు.