Lifestyle: నా త‌మ్ముడిని వ‌దిలేసి పెళ్లి చేసుకోవాలా?

my brother is mentally unstable should i marry at this time

Lifestyle: నా వ‌య‌సు 29. ఉద్యోగం చేస్తున్నాను. నాకు త‌మ్ముడు ఉన్నాడు. కానీ త‌నో మాన‌సిక విక‌లాంగుడు. అమ్మానాన్న‌లు లేరు. నేనే త‌మ్ముడిని చూసుకుంటున్నాను. చుట్టాలేమో ఇంకెన్నాళ్లు త‌మ్ముడిని చూసుకుంటావు హాయిగా పెళ్లి చేసుకో అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థంకాక రాత్రిళ్లు నిద్ర‌ప‌ట్ట‌డంలేదు. ఏద‌న్నా స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు.

నిపుణుల స‌ల‌హా

చిన్న వ‌య‌సులోనే త‌మ్ముడి బాధ్య‌త తీసుకున్నావు. చాలా గొప్ప విష‌యం. ఇప్పుడు నువ్వు మంచి ఉద్యోగంలో ఉన్నావు. ఇక పెళ్లి విష‌యానికొస్తే.. నీ జీవితంలో ఎవ‌రైనా ఉన్నారా? అంటే ప్రేమ వివాహం అనుకుంటున్నావా? లేక మీ చుట్టాలు సంబంధాలు చూస్తున్నారా? మీరు ఏ వివాహం చేసుకోవాల‌నుకున్నా త‌మ్ముడి బాధ్య‌త గురించి చేసుకోబోయేవాడికి వివ‌రించండి. మీ త‌మ్ముడికి మీరు త‌ప్ప ఎవ్వ‌రూ లేరు. అంతేకానీ మీరు పెళ్లి చేసుకుని మీ దారి మీరు చూసుకుంటే పాపం ఆ అబ్బాయి ప‌రిస్థితి ఏంటి? ఆశ్ర‌మాల్లో చేర్పిస్తే వారు స‌రిగ్గా చూసుకుంటార‌న్న న‌మ్మ‌కం కూడా పెట్టుకోలేం. ఒక‌సారి బాగా ఆలోచించండి.