Ramzan వేళ.. వ్యాపారం కళకళ
Hyderabad: రంజాన్(ramzan) వచ్చిందంటే చాలు.. హైదరాబాద్(hyderabad) ప్రాంతం రద్దీగా మారుతుంది. ఇక మరో వారం రోజుల్లో రంజాన్ వస్తుండటంతో.. వ్యాపార సముదాయాలు(business areas) ఉన్న ప్రాంతాలు అన్నీ ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ(telangana government) 24 గంటల పాటు దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ తెరిచి ఉంచుకోవచ్చని చెప్పడంతో.. వ్యాపారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత మూడేళ్లుగా కొవిడ్(covid) మహమ్మారి కారణంగా సరైన వ్యాపారాలు లేక నిరాశ చెందిన వారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్‌కు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఉత్తరాది, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి రంజాన్ షాపింగ్‌ను(ramzan shopping) చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడి ప్రశాంత వాతవరణాన్ని వారు ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపకుండా.. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ఇక రంజాన్ పండుగ నేపథ్యంలో చార్మినార్(charminar), పాతేర్‌గట్టి, ఖిల్వత్, సుల్తాన్ బజార్, మల్లేపల్లి, టోలీచౌకి, అబిడ్ రోడ్, నాంపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్(secunderabad)లోని వ్యాపార సముదాయాల్లో జనాల రద్దీ పెరిగింది. గుల్జార్ హౌజ్ మార్కెట్లో లభించే అత్యంత ఖరీదైన ముత్యాల నుంచి సేఫ్టీ పిన్ల వరకు.. ప్రతి చిన్న వస్తువులను అక్కడ కొనుగోలు చేయవచ్చు. మదీనా బిల్డింగ్, మొఘల్‌పురా మధ్య 2 కి.మీ మేర బాణాసంచా, బూట్లు, ఇతర పాదరక్షలు, గృహోపకరణాలు, దుస్తులు, పెళ్లి దుస్తులు, సంప్రదాయ దుస్తులు, క్యాప్స్, బ్యాంగిల్స్(bangles), ఇతర వస్తువులు అక్కడ లభిస్తాయి. “ఇఫ్తార్ సమయంలో, షాప్ కీపర్లు కస్టమర్లు తమ ‘రోజా’ను మరింత విస్తృతం చేయడానికి పండ్లను అందిస్తున్నారు. ఇక లాల్ బజార్ బ్యాంగిల్ మార్కెట్ శోభ గురించి వేరే చెప్పనక్కర్లేదు… ఎన్నో ఏళ్లుగా చెక్కుచెదరకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలను ఈ మార్కెట్ ఆకర్షిస్తోంది.