ఘోరం.. IAS అధికారి భార్య‌పై స‌వ‌తి కొడుకు అత్యాచారం

ias officer wife raped by step son

Viral News:  ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖ్‌నౌలో దారుణం చోటుచేసుకుంది. ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి భార్య‌పై స‌వ‌తి కొడుకు అత‌ని స్నేహితుడు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. 2020లో జ‌మ్ము క‌శ్మీర్‌లో ఐఏఎస్ కేడ‌ర్‌లో ప‌నిచేసిన అధికారి ఓ అనాథ‌ను వివాహం చేసుకున్నారు. ఇత‌నికి ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడు. భార్య చ‌నిపోవడంతో మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె వ‌య‌సు 40. ఈ నేప‌థ్యంలో నెల రోజుల క్రితం మొద‌టి భార్య కుమారుడు త‌న స్నేహితుడు క‌లిసి ఆమెను గ‌దిలో బంధించి అత్యాచారం చేసార‌ట‌. పోలీసుల‌కు చెప్ప‌కూడ‌దు అని రాత‌పూర్వ‌కంగా లెట‌ర్ రాయించుకుని ఆ త‌ర్వాత వ‌దిలేసార‌ట‌. కానీ ఆ మహిళ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.