Rahul Dravid: టీమిండియా ఘన విజయం.. BCCI బంపర్ ఆఫర్ వద్దన్న ద్రావిడ్
Rahul Dravid: టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్‌కి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ద్రావిడ్ నేతృత్వంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియాకు ప్రపంచ కప్ రావడంతో బీసీసీఐ రూ.5 కోట్లు బోనస్‌గా ఇస్తామని తెలిపిందట. కానీ ఇందుకు ద్రావిడ్ ఒప్పుకోలేదు. అందులో సగం తగ్గించి రూ.2.5 కోట్లు ఇస్తే చాలని అన్నాడట. ఒకవేళ తనకు బోనస్ ఇవ్వాలనుకుంటే ప్రపంచ కప్ సాధించేందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికి అంతే బోనస్ ఇస్తేనే తీసుకుంటానని వెల్లడించారట. అయితే.. అందరికీ అంత ఎక్కువ బోనస్ ఇవ్వలేక ద్రావిడ్ అడిగిన రూ.2.5 కోట్లు ఇచ్చేందుకు బీసీసీఐ ఒప్పుకుంది.