Kodali Nani: చంద్రబాబు ఉచిత ఇసుకపై కొడాలి నాని ప్రశంసలు!

kodali nani praised chandrababu naidu free sand scheme

Kodali Nani: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇస్తున్న ఉచిత ఇసుక విష‌యంపై ఆరా తీసేందుకు వెళ్లారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నాని. సొంతంగా త‌న ట్రాక్ట‌ర్ తీసుకుని ఉచిత ఇసుక నిజంగానే ఇస్తున్నారా లేదా అని చెక్ చేసేందుకు వెళ్లార‌ట‌. కేవలం టన్నుకి రూ.88 చెల్లించి…ట్రాక్టర్ ఇసుక సొంతగా లోడ్ చేసుకుని తీసుకుని వెళ్లారు. తన సొంత ట్రాక్టర్ కావటంతో.. రవాణా చార్జీలు కూడా లేకపోవటంతో రూ.500 లోపే డబ్బు కట్టి ట్రాక్టర్ ఇసుక తీసుకుని వెళ్లాడు. వైఎస్సార్ కాంగ్రెస్ హ‌యాంలో హడావిడి చూసి విమర్శలు చేద్దాం అని వచ్చి ఇక్కడ సీన్ చూసి కొడాలి నాని షాకయ్యార‌ట‌.