Ruturaj Gaikwad: కోహ్లీ పొజిష‌న్‌లో రుతు.. ధోనీ స్థానంలోనే ఆడుతున్న‌ట్లుంది

Ruturaj Gaikwad talks about taking number 3 position

Ruturaj Gaikwad: T20 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ నెంబ‌ర్ 3 పొజిష‌న్‌లో ఆడేవాడు. మొన్న టీ20 ప్ర‌పంచ క‌ప్ స‌మ‌యంలోనూ కోహ్లీ నెంబ‌ర్ 3 పొజిష‌న్‌లో ఆడి త‌న స‌త్తా చాటాడు. ఇప్పుడు కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వ‌డంతో ఆ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ భ‌ర్తీ చేసాడు. దీనిపై రుతురాజ్ స్పందిస్తూ.. కోహ్లీ స్థానంలో ఆడుతున్నా ధోనీ స్థానంలో ఆడుతున్న‌ట్లే ఉంద‌ని తెలిపాడు. త‌న‌కు ఓపెనింగ్‌లో ఆడమ‌న్నా నెంబ‌ర్ 3 పొజిష‌న్‌లో ఆడ‌మ‌న్నా ఎలాంటి స‌మ‌స్య లేద‌ని.. రెండింటిలోనూ కొత్త బాలే ఫేస్ చేయాల్సి వ‌స్తుంద‌ని తెలిపాడు. తాను కోహ్లీ పొజిష‌న్‌లో ఆడుతున్న‌ప్ప‌టికీ త‌న గేమ్‌పై ఫోక‌స్ చేయాల‌నుకుంటున్నాన‌ని.. ద‌య‌చేసి త‌న‌ను ధోనీతో కోహ్లీతో పోల్చి చూడొద్ద‌ని రిక్వెస్ట్ చేసాడు.