Guntur: అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్మాడు.. మోసపోయాడు
Guntur: ఓ వ్యక్తి చేసిన అప్పు తీర్చేందుకు ఏకంగా కిడ్నీ అమ్ముకున్నాడు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ అప్పును మాత్రం తీర్చలేకపోయాడు. ఇందుకు కారణం ఓ హాస్పిటల్ చేసిన మోసం. గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తి లోన్ యాప్స్ ద్వారా దాదాపు రూ.30 లక్షలు అప్పు చేసాడు.
ఆ అప్పు తీర్చేందుకు తన దగ్గర డబ్బు లేకపోవడంతో గుంటూరులోని విజయ హాస్పిటల్ వైద్యులతో ఓ డీల్ కుదుర్చుకున్నాడు. తన ఎడమ కిడ్నీ దానం చేస్తానని.. అందుకు తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఇందుకు వారు ఒప్పుకున్నారు. తీరా చూస్తే వారు ఎడమ కిడ్నీకి బదులు కుడి కిడ్నీ తీసుకున్నారు. అంతేకాదు.. నువ్వు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కిడ్నీ దానం చేసావు. ఇందుకు నీకు బహుమానంగా రూ.1 లక్ష ఇస్తాం. అంతేకానీ రూ.30 లక్షలు ఇవ్వలేం అని మాట మార్చేసారు. దాంతో ఆ వ్యక్తి ఇంకా సర్జరీ నుంచి కోలుకోకుండానే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. దయచేసి ఇలాంటి లోన్ యాప్స్‌ను నమ్మి డబ్బు తీసుకోవద్దని మనవి.