Face packs: ఉల్లి రసంతో నిగనిగలు..!
Hyderabad: ఉల్లి (Onion) చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిపాయల్లోని సుగుణాలు అలాంటివే మరి. అవి కోసేటప్పుడు కళ్లు మండుతాయన్న మాట నిజమే కానీ.. ఆ ఉల్లి రసంతో అందం (beauty) రెట్టింపు అవుతుందన్న విషయం తెలుసా? మీరు చదివింది నిజమే. ఉల్లిపాయతో ఫేస్‌ప్యాక్స్(face packs) కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలో విటమిన్ C (vitamin c) పుష్కలంగా ఉంటుంది. ముఖంపై ఏర్పడే నల్లమచ్చలను(black spots) నివారించడంలో విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది.
2 టేబుల్ స్పూన్ల సెనగపిండి(Besan)లో అర చెంచా పాలు(milk), అర చెంచా ఉల్లి రసం(onion juice) కలిపి ముఖానికి పూతలా వేయండి. ఒక 10 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో కడిగేయండి. ఒక చెంచా అలోవెరా(Aloevera) గుజ్జులో అర చెంచా ఉల్లిరసం వేసి ముఖానికి రాస్తే డెడ్ స్కిన్ అంతా పోతుంది. ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకున్నాక మార్పు మీకే తెలుస్తుంది.
పెరుగు(Curd)లో కొద్దిగా సువాసనగల నూనెను వేసి ఉల్లిరసం కూడా కాస్త కలిపి ముఖానికి పట్టించండి. ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేయండి. ఆ తర్వాత నీటిలో ముంచిన దూదితో కడిగేయండి. అర చెంచా టొమాటో (Tomato) గుజ్జులో అంతే మోతాదులో ఉల్లి నూనె వేసి ముఖానికి పట్టించినా మంచి ఫలితం కనిపిస్తుంది. వేప (Neem oil) నూనె, ఉల్లి నూనెలు కలిపి కాస్తంత ముఖానికి పట్టించినా మంచిదే. పార్టీలు, ఏదైనా అర్జెంట్ ఫంక్షన్లకు వెళ్లాంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.. నలుగురిలో మీ ముఖం నిగనిగలాడుతుంటుంది.