Kodali Nani: హైకోర్టులో నానికి ఊర‌ట‌

big relief to kodali nani from ap high court

Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఏపీ వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు. త‌మ చేత బ‌ల‌వంతంగా రాజీనామా చేయించార‌ని కేసులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో వాదోప‌వాదాలు విన్న కోర్టు నానిని అరెస్ట్ చేయొద్ద‌ని పేర్కొంది. ఎందుకంటే గ‌తంలో వాలంటీర్లు స్వ‌చ్ఛందంగానే రాజీనామా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత నాని త‌మ చేత బ‌ల‌వంతంగా రాజీనామా చేయించార‌ని ఆరోపిస్తున్నారు. దాంతో ఈ కేసును మ‌రింత ప‌రిశీలించాల్సి ఉంద‌ని వెల్ల‌డిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.