Spain: పోర్న్ పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టిన స్పెయిన్.. అసలేంటీ పాస్‌పోర్ట్?
Spain: స్పెయిన్ దేశం పోర్న్ పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. దాంతో ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేంటీ పోర్న్ పాస్‌పోర్ట్? ఎందుకు స్పెయిన్ దీనిని ప్రవేశపెట్టాల్సి వచ్చింది? వంటి విషయాలను తెలుసుకుందాం. పిల్లలు పోర్న్ వెబ్‌సైట్లు వీక్షించకుండా ఉండేందుకు స్పెయిన్ ఈ పోర్న్ పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు విపరీతంగా పోర్న్ చూస్తున్నారట. దాంతో మైనర్ల విషయంలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలో డిజిటల్ వాలెట్ బీటా అనే యాప్‌ను స్పెయిన్ రూపొందించింది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే వారు తాము 18 ఏళ్ల పైబడి ఉన్నట్లు అన్ని ఆధారాలను చూపించాలి. ఒకవేళ అడల్ట్ వెబ్‌సైట్స్ వీక్షించాలంటే ఈ యాప్ ఒక క్యూఆర్ కోడ్‌ని చూపిస్తుంది. ఈ కోడ్‌ని యాక్సెస్ చేస్తేనే పోర్న్ చూసే అవకాశం ఉంటుంది. ఒక నెలలో పోర్న్ కంటెంట్ వీక్షించాలనుకుంటే ఈ యాప్ 30 క్రెడిట్స్ ఇస్తుంది. 30 క్రెడిట్స్ అయిపోయాక ఇక ఆ కంటెంట్ చూసే అవకాశం ఉండదు. అయితే ఈ పాస్‌పోర్ట్ అనేది కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే. దీని వల్ల మైనర్లు పోర్న్ కంటెంట్ వీక్షించే వీలు ఉండదు.