Kuldeep Yadav: హీరోయిన్‌ని మాత్రం పెళ్లి చేసుకోను
Kuldeep Yadav: త్వరలో తన నుంచి పెళ్లి కబురు వింటారని అన్నాడు క్రికెటర్ కుల్దీప్ యాదవ్. కొంతకాలంగా కుల్‌దీప్ బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో కుల్దీప్ స్పందించాడు. పెళ్లి చేసుకోబోతున్న మాట నిజమే కానీ అది బాలీవుడ్ నటిని మాత్రం కాదని తెలిపాడు. తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలని అన్నాడు. త్వరలో తన పెళ్లి గురించి ప్రకటన వస్తుందని పేర్కొన్నాడు.