YS Jagan: బోరున విల‌పిస్తున్న త‌ల్లి.. వ‌దిలేసి వెళ్లిపోయిన జ‌గన్

YS Jagan leaving his weeping mother at ysr ghat is receiving flak

YS Jagan: ఈరోజు దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 75వ జయంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద కుటుంబీకులు నివాళులు అర్పించారు. వైఎస్సార్ భార్య విజ‌య‌మ్మ‌, కూతురు వైఎస్ ష‌ర్మిళ‌, కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌లు నివాళులు అర్పించారు. అయితే జ‌గ‌న్ నివాళులు అర్పిస్తున్న స‌మ‌యంలో విజ‌య‌మ్మ అక్క‌డే ఉన్నారు. కొడుకు చూసి బోరుల విల‌పించారు. అయితే జ‌గ‌న్ గుండెబ‌రువెక్కి ఉన్న అమ్మ‌ను ద‌గ్గ‌రికి తీసుకుని ఓదార్చ‌కుండా స‌రే స‌రే వెళ్లొస్తాను అంటూ హ‌త్తుకున్న ఆమెను దూరంగా పెట్టి అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. దాంతో విజ‌య‌మ్మ మ‌రింత క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అక్క‌డే ఉన్న కుటుంబీకులు ఆమెను ఓదార్చి అక్క‌డి నుంచి తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ అవుతోంది.