Btech Ravi: ఆల్రెడీ వివేకా కేసు ఉంది.. ఇంకో కేసు అవసరమా?
Btech Ravi: పులివెందుల మార్కెట్ కమిటీ విషయంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడం పట్ల స్పందించారు తెలుగు దేశం పార్టీ నేత బీటెక్ రవి. 2019 మే నెలలో ఇంకా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే తాము గెలిచేసామంటూ మార్కెట్ కమిటీ ఉద్యోగులను అప్పటికప్పుడు తొలగించేసారని రవి అన్నారు. కొంత సమయం ఇవ్వండి సర్.. వేరే ఉద్యోగం వచ్చాక వెళ్లిపోతాం అని ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని అన్నారు.
ఇప్పుడు మళ్లీ తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించగలుగుతారా అని తమ నేతలను ఆ ఉద్యోగులు అడిగారని రవి అన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అలా ఎలా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తీసేస్తారని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై రవి స్పందిస్తూ.. మరి ఆనాడు మార్కెట్ కమిటీ ఉద్యోగులను తీసేసినప్పుడు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. 2019లో మార్కెట్ కమిటీ నుంచి తీసేసిన వారికి భారతి సిమెంట్స్‌లో ఉద్యోగాలు ఇవ్వగలరా అని అడిగారు. ఇప్పుడు ధర్నాలు చేపడితే ఒరిగేది ఏమీ లేదని.. ఆల్రెడీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇరుక్కున్న జగన్, అవినాష్‌లు మరో కేసులో ఇరుక్కోవడం అవసరమా అని ప్రశ్నించారు.