Arshdeep Singh: బుమ్రా 3 ఫార్మాట్లు ఆడ‌మని చెప్పాడు

Arshdeep Singh reveals jasprit bumrah advice to him

Arshdeep Singh: జ‌స్ప్రీత్ బుమ్రా త‌న‌ను 3 ఫార్మాట్లు ఆడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడ‌ని అన్నాడు క్రికెట‌ర్ అర్ష్‌దీప్ సింగ్. టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలుపులో అర్ష్‌దీప్ కూడా త‌న‌వంతు పాత్ర పోషించాడు. 17 వికెట్లు తీసి మంచి మార్కులు కొట్టేసాడు. అర్ష్‌దీప్‌కి బుమ్రాతో పాటు టెస్ట్ క్రికెట్ ఆడాల‌న్న క‌ల ఉంద‌ట. 2022లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అర్ష్‌దీప్ ఇప్ప‌టివ‌ర‌కు 52 T20I మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు తీసాడు.

ఆరు ODI మ్యాచ్‌లు కూడా ఆడాడు కానీ టెస్ట్ మ్యాచ్‌లు మాత్రం ఆడ‌లేదు. ఈ నేప‌థ్యంలో బౌలింగ్ క్వాలిటీ పెంచుకునేందుకు బుమ్రా త‌న‌కు ఓ స‌ల‌హా ఇచ్చాడ‌ని.. త‌న‌ను మూడు ఫార్మాట్ల‌లోనూ ఆడాల‌ని చెప్పాడ‌ని తెలిపాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌కి పాకిస్థానీ క్రికెట‌ర్ వ‌సీం అక్రం కూడా ఫిదా అయ్యాడు. ఎప్పుడు బాల్‌ను స్వింగ్ చేయాలో ఎక్క‌డ రిలీజ్ చేయాలో అర్ష్‌దీప్‌కి బాగా తెలుస‌ని.. ఇక అత‌ను రెడ్ బాల్ మ్యాచ్‌లు కూడా ఆడితే టీమిండియాకు ఎంతో లాభ‌మ‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.