Ravi Shastri: అస‌లు నువ్వెప్పుడైనా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచావా?

Ravi Shastri slams micheal vaughan remarks on india

Ravi Shastri:  టీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ మొత్తం టీమిండియా కోస‌మే పెట్టినట్లుంద‌ని ICC ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ మైఖెల్ వాగ‌న్ తెగ ఏడ్చాడు. దీనిపై క్రికెట్ లెజెండ్ రవిశాస్త్రి కాస్త ఘాటుగానే స్పందించారు.

“” వాగ‌న్ ఎన్ని మాట్లాడినా ఇండియాలో ఎవ్వరూ ప‌ట్టించుకోరు. ఒక‌ప్పుడు అత‌ను నా కొలీగ్ కాబ‌ట్టి నేను స్పందించాల్సి వ‌స్తోంది. ఇంగ్లాండ్ ఎందుకు గెల‌వ‌లేక‌పోయిందో ముందు ప‌రిశీలించుకోండి. ఇంగ్లాండ్ రెండుసార్లు మాత్ర‌మే గెలిచింది. కానీ టీమిండియాకు క‌ప్‌లు గెలిచే అల‌వాటుంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు క‌ప్‌లు గెలిచింది. అస‌లు వాగ‌న్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ ఒక్క ప్ర‌పంచ‌క‌ప్ అయినా గెలిచిందా? అందుకే ముందు వాళ్ల ప‌ని వాళ్లు చూసుకుంటే బాగుంటుంది “” అని మండిప‌డ్డారు.