Rohit Sharma: అదే జరిగితే సూర్యను టీం నుంచి తీసేసేవాడిని
Rohit Sharma: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ మిల్లర్ బాదిన సిక్స్‌ను పట్టుకోకపోయి ఉంటే టీం నుంచి తొలగించేసి ఉండేవాడినని అన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచ కప్ మన సొంతం అయ్యిందంటే అందుకు సూర్య క్యాచ్ ప్రధాన కారణం. లేదంటే ఫలితం మరోలా ఉండేది. నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం టీమిండియాను సత్కరించింది. ఈ కార్యక్రమంలో రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.