Raj Tarun: షాకింగ్.. హీరో రాజ్‌తరుణ్ మోసం చేసాడంటూ యువతి హల్చల్
Raj Tarun: ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతి హల్చల్ చేసింది. ఈరోజు ఆమె రాజ్‌తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. పదకొండేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని.. ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య తెలిపింది.
తాను కలిసి పనిచేసిన హీరోయిన్‌తో తరుణ్ ఎఫైర్ పెట్టుకుని ఆమె కోసం తనని వదిలేసాడని పేర్కొంది. తరుణ్‌ని వదలకపోతే అతన్ని చంపేస్తామని ఆ హీరోయిన్ అన్న బెదిరిస్తున్నాడని వాపోయింది. మూడేళ్ల క్రితం తరుణ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని.. ఈ గ్యాప్‌లోనే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్‌ను వల్లో వేసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాజ్‌తరుణ్‌పై ఆ హీరోయిన్‌పై హీరోయిప్ అన్నపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.