Perni Nani: చంద్ర‌బాబు గారూ.. మీరు ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో లేరు

Perni Nani asks tdp to realise that they are in power

Perni Nani:  తెలుగు దేశం పార్టీ నేత‌లు ఇంకా ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నార‌ని అనుకుంటున్నార‌ని సెటైర్ వేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత పేర్ని నాని. మైనింగ్, పీసీబీ ఫైల్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు త‌గ‌ల‌బెట్టార‌ని కొంత‌కాలంగా తెలుగు దేశం పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై పేర్ని నాని స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు ఫైల్స్ కాల్చేసారు అని ఏడ్చే బ‌దులు సీబీఐ ఎంక్వైరీ వేసి త‌ప్పు చేసిన వారికి క‌ఠిన శిక్ష ఎందుకు వేయ‌డం లేదు అని ప్ర‌శ్నించారు. ఇంకా ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నారని అనుకుంటున్నారేమో అని సెటైర్ వేసారు. ఫైల్స్ కాల్చేస్తుంటే ఆప‌కుండా గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా అంటూ నోరుపారేసుకున్నారు.