Viral News: భార్యకు సర్ప్రైజ్.. బయటపడిన ఎఫైర్!
Viral News: హాలిడే ట్రిప్‌కి వెళ్లిన భార్యకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్న భర్తకు షాక్ తగిలింది. భార్య ఎఫైర్ బయటపడటంతో అతని గుండెపగిలింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఇవాన్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇవాన్‌కు పదేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. సంతోషంగానే ఉండేవారు. అయితే ప్రతి మూడు నెలలకోసారి ఇవాన్ భార్య తన స్నేహితురాళ్లతో ట్రిప్‌కి వెళ్తుంటుంది. ఇవాన్ కూడా ఎప్పుడూ అడ్డుపడలేదు. అయితే ఓసారి ఇలాగే ఇవాన్ భార్య ట్రిప్‌కి వెళ్లింది.
అయితే ఆమె ఇంటికి వచ్చే సమయానికి ఇల్లంతా క్లీన్‌గా ఉంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య రూం శుభ్రం చేస్తుండగా ఓ కార్డ్‌బోర్డు కనిపించింది. అది తీసి చూడగానే ఇవాన్ షాకయ్యాడు. ఇవాన్ భార్య మరో వ్యక్తితో దాదాపు ఆరు నెలలుగా ఎఫైర్ పెట్టుకుంది. ఆమె ట్రిప్‌కి వెళ్లేది కూడా స్నేహితురాళ్లతో కాదు. ఆ ప్రియుడితో. ఆ కార్డ్‌బోర్డులో లవ్లెటర్లు, కానుకలు ఉన్నాయి. అది చూసి ఇవాన్‌కు ఒళ్లు మండిపోయింది. ఆమె వచ్చాక తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెని వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టు బ్రో అని సముదాయిస్తున్నారు.