Katasani Rambhupal Reddy: మేం తిరగబడితే TDP తట్టుకోలేదు
Katasani Rambhupal Reddy: తెలుగు దేశం పార్టీ నేతలు కావాలనే తమ నేతల కార్యాలయాలను వాహనాలను దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కాటసాని రామ్భూపాల్ రెడ్డి. వీరికి పోలీస్ వ్యవస్థ వత్తాసు పలకడం ఏమాత్రం బాలేదని.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తమ మౌనాన్ని చేతకాని తనం అనుకుంటే అది పొరపాటని తాము తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు వారికి మంచి ఎలా చేయాలి అభివృద్ధి ఎలా చేయాలా అని ఆలోచించాలే కానీ ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవాలని అనుకోవడం ప్రజాస్వామ్యం కాదని.. దివంగత నందమూరి తారక రామారావు కూడా దీనిని ఉపేక్షించరని అన్నారు.