Kethireddy Venkatarami Reddy: చంద్రబాబు తప్పు లేదు.. అంతా ఆ ఇద్దరే చేసారు
Kethireddy Venkatarami Reddy: మొన్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడానికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పే లేదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అంతా కలిసి ఉంటే మూడో వ్యక్తి వచ్చి నాశనం చేయాలనుకున్నా చేయలేడని.. షర్మిళ, విజయమ్మ జగన్తో కలిసి లేరు కాబట్టే చంద్రబాబు నాయుడు దానిని ఆసరాగా తీసుకుని అవకాశాన్ని వాడుకున్నారని తెలిపారు.
షర్మిళ, విజయమ్మ చేసింది నూటికి నూరు శాతం తప్పేనని.. ఆ ఇద్దరి వల్లే రాష్ట్రంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఎక్కడైతే బాగా ఓట్లు పడతాయని సర్వేల్లో తేలిందో అక్కడే తనకు తక్కువ ఓట్లు పడటం పట్ల తాను షాకయ్యానని పేర్కొన్నారు. అయితే తన గుడ్మార్నింగ్ గన్నవరం కార్యక్రమం మళ్లీ కొనసాగిస్తానని.. కాకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత వారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అప్పుడు తాను ఆ కార్యక్రమంలో ఇంటింటికీ మళ్లీ తిరుగుతానని ఛాలెంజ్ చేసారు.