Pawan Kalyan: వేల కోట్ల అప్పులు.. నాకు జీతం వద్దు
Pawan Kalyan: జీతం తీసుకుంటే అది ప్రజల కష్టార్జితం కాబట్టి బాధ్యత తెలుస్తుందని.. అందుకే జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నానని గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పవన్ చేతిలో ఉన్న శాఖల్లో పంచాయతీ రాజ్ ఒకటి. అయితే పంచాయతీ రాజ్ క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ కూడా లేకపోవడంతో తాను షాకయ్యానని.. అందుకే అధికారులకు కొత్త ఫర్నీచర్ కొనద్దు తానే తెచ్చుకుంటానని చెప్పానని పవన్ తెలిపారు. జీతం తీసుకుని పని చేయాలనుకున్నా కానీ పంచాయతీ శాఖలో డబ్బులు లేవని.. పైగా వేల కోట్లు అప్పులు ఉండడంతో జీతం తీసుకోకుండా పనిచేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.