జాత‌కం ఎంత నీచంగా ఉన్నా ఈ రెమెడీ చేస్తే చాల‌ట‌

spiritual-remedy-to-make-life-turn-better

Spiritual: చాలా మంది జాత‌క చ‌క్రం బాగోలేక‌నో లేదా ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఎప్పుడూ క‌ష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఏం చేసినా ఆ పని ఆగిపోవ‌డ‌మో.. నెగిటివ్ ఫ‌లితాల‌ను ఇవ్వ‌డ‌మో జ‌రుగుతుంది. వారు ఎన్ని గుళ్లు గోపురాలు తిరిగినా కూడా ఫ‌లితం క‌నిపించ‌క‌పోవ‌చ్చు. జాత‌కం ఎంత నీచంగా ఉన్నా.. ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌వారు కేవ‌లం ఈ చిన్న రెమిడీ చేసుకుంటే స‌రిపోతుంద‌ట‌. అదేంటో తెలుసుకుందాం.

ఓ మ‌నిషి జీవితంలో ఆటంకాలు ఎదుర‌వుతున్నాయంటే.. అత‌ని జ‌న్మ జాత‌కంలో అడ్డంకులు ఉన్న‌ట్లు అర్థం. ఈ అడ్డంకుల‌ను తొల‌గించే ఏకైక దైవం అమ్మ‌వారి పుత్రుడు గ‌ణ‌నాథుడు. అందుకే ఆయ‌న్ను విఘ్నేశ్వ‌రుడు అంటారు. అంటే.. విఘ్నాల‌ను తొల‌గించేవాడు అని అర్థం.  మీరు అమ్మ‌వారిని శ‌ర‌ణు కోరినా.. ఆ అమ్మ‌వారు త‌న కుమారుడు గ‌ణ‌ప‌తినే పిలుస్తుంద‌ట‌. ఇక ఈ రెమిడీ ఎలా చేయాలంటే.. రెండు గ్లాసులు తీసుకోండి. వాటిలో కేవ‌లం ఒక గ్లాసులో మాత్ర‌మే నీళ్లు పోయండి.

ముందు ఆచ‌మ‌నం చేసుకుని గ‌ణ‌ప‌తి పూజ చేసుకోండి. ఆ త‌ర్వాత ఉద్ధ‌ర‌ణితో గ్లాసులోని నీటిని కొద్దిగా తీసుకుని ఓం కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అని ధ్యానిస్తూ ఆ నీటిని చూస్తూ ఆ నీటిని ప‌క్క‌నే ఉన్న ఖాళీ గ్లాసులో ఆ నీటిని వేస్తూ ఉండండి. ఇలా ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేయాలి. ఈ నామం వ‌ల్ల పార్వ‌తి దేవి ప‌ర‌మేశ్వ‌రుడు గ‌ణ‌పతుల అనుగ్ర‌హం క‌లుగుతుంది. ఆ త‌ర్వాత ఆ నీటికి న‌మ‌స్క‌రించి దానిని సేవించండి. ఈ ప్ర‌క్రియ‌ను రోజూ చేస్తుంటే మీ జీవితంలో క‌లిగే మార్పులు మీకే తెలుస్తాయి.