Viral News: నిద్రిస్తున్న వ్య‌క్తి డ్రాయ‌ర్‌లో దూరిన కోబ్రా

man finds cobra in his boxers

Viral News: జంతువుల‌ను అమితంగా ప్రేమించేవారు కూడా పాములంటే ఆమ‌డ దూరంలో ఉంటారు. వాటిని ఒక కిలోమీట‌రు దూరం నుంచి చూస్తేనే భ‌యంతో చ‌స్తారు. అలాంటిది ఓ వ్య‌క్తి నిద్రిస్తున్న స‌మ‌యంలో పాము ఏకంగా అత‌ని డ్రాయ‌ర్‌లోకే దూరింది. నిద్ర‌లో ఏవో క‌ద‌లిక‌లు గ‌మ‌నించిన ఆ వ్య‌క్తి లేచి చూసేస‌రికి డ్రాయ‌ర్‌లో పాముని చూసి షాక‌య్యాడు. అయితే అత‌ను స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డాడు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే నిద్రిస్తున్న త‌న స్నేహితుడిని నిద్ర‌లేపి.. త‌న డ్రాయ‌ర్‌లో పాము దూరింద‌ని సైగ‌లు చేసి చెప్పాడు. అలా ఆ వ్య‌క్తి ఎమ‌ర్జెన్సీ సర్వీసెస్‌కి ఫోన్ చేయ‌డంతో వారు వ‌చ్చి చాక‌చక్యంగా దానిని బ‌య‌టికి తీసారు. తీరా బ‌య‌టికి తీసి చూడ‌గా.. అది మామూలు పాము కాదు కోబ్రా అని తెలిసింది. ఆ వ్య‌క్తి స‌మ‌యస్ఫూర్తితో క‌ద‌ల‌కుండా విగ్ర‌హంలా ప‌డుకున్నాడు కాబ‌ట్టి బ‌తికిపోయాడు. ఏమాత్రం క‌దిలినా అరిచినా కాటేసేదే..!