Satyabhama: సైలెంట్‌గా ప్రైంలోకి వచ్చేసిన కాజల్ కొత్త సినిమా
Satyabhama: కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ సినిమా సైలెంట్‌గా అమెజాన్ ప్రైంలోకి వచ్చేసింది. ఈరోజు నుంచే ఈ సినిమా ప్రైంలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు రేటింగ్ 10కి 8.6 ఉంది. శశికిరణ్ తిక్క సమర్పణలో ఆరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ మెయిల్ రోల్‌లో నటించగా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 7న రిలీజ్ అయ్యింది. థియేటర్‌లోనూ ఈ సినిమా మంచి టాక్ అందుకుంది.