Pinnelli Ramakrishna Reddy: బుద్ధి రాలే.. TDP కార్యకర్త కడుపులో గుద్దిన పిన్నెళ్లి
Pinnelli Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎం పగలగొట్టిన కేసులో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను మర్యాదపూర్వకంగా అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో స్థానికులు గుడిగూడారు. ఆ స్థానికుల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్త కూడా ఉన్నాడు. అతను తెలుగు దేశం పార్టీ వాడని తెలిసి పిన్నెళ్లి పోలీసుల ముందే అతని కడుపులో గుద్దాడు. అరెస్టైనా ఇంకా ఈయనకు బుద్ధి రాలేదు అంటూ తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు మండిపడుతున్నారు.