Rajendra Nagar: మైనర్లయినా పడుకోవాల్సిందే.. గలీజ్ పోలీస్
Rajendra Nagar: రాజేంద్రనగర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ రాసలీలలు షాక్‌కి గురిచేసింది. మైనర్లను కూడా వదలకుండా అందరూ తనతో పడుకోవాలి అంటూ రాజేంద్రనగర్ కానిస్టేబుల్ ప్రదీప్ ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు. వారితో శృంగారం చేస్తూ వీడియోలు తీసి బయట చెప్తే ఆ వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. అతను కేవలం మైనర్లనే టార్గెట్ చేసేవాడు. బాధితులు బయటికి వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. మైనర్ల ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి వారిని లొంగదీసుకుంటున్నాడని విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.