Gautam Gambhir: గంభీర్ నేతృత్వంలో గుడ్‌బై చెప్పనున్న టాప్ క్రికెటర్లు వీరే
Gautam Gambhir: త్వరలో గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. గంభీర్ టెస్ట్, ODI, T20 సిరీస్‌లకు విభిన్న ప్లేయర్లు ఉన్న టీంను సిద్ధం చేసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ నేతృత్వంలో టీమిండియాలోని టాప్ క్రికెటర్లు గుడ్‌బై చెప్పనున్నారు. యువ క్రికెటర్లు, ఫిట్నెస్ అంశాలపై గంభీర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సీనియర్ ప్లేయర్లను.. 2027 ప్రపంచ కప్ కోసం యువ ప్లేయర్లను ఎంపికచేస్తానని ముందే గంభీర్ బీసీసీఐకి వెల్లడించారు. గంభీర్ పెట్టిన ప్రతీ కండీషన్‌కు బీసీసీఐ ఒప్పుకోవడంతో టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. గంభీర్ కోచ్ బాధ్యతలు తీసుకున్నాక ఈ స్టార్ క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పక తప్పదు. వారెవరంటే..
రోహిత్ శర్మ
వయసు, ఫిట్నెస్ అంశాలను పరిగణనలోకి తీసుకుని రోహిత్ శర్మను T20లు, టెస్ట్ క్రికెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ అవసరం ఉంది. ఆ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ
యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చే అంశంలో విరాట్‌ను T20ల నుంచి తప్పించే అవకాశం ఉంది. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏంటనేది కోహ్లీ చెప్పాలి.
రవీంద్ర జడేజా
వైట్ బాల్ ఫార్మాట్స్‌లో జడేజా ఇక కనిపించకపోవచ్చు. యువ ఆల్ రౌండర్లకు అవకాశం ఇవ్వనున్నారు.
మహ్మద్ షమి
ఫిట్నెస్ విషయం నేపథ్యంలో షమీని వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. 2027 ప్రపంచ కప్ కోసం యువ బౌలర్లను సిద్ధం చేయనున్నారు.
మహ్మద్ సిరాజ్
వైట్ బాల్ క్రికెట్లో సిరాజ్ అడపాదడపా కనిపిస్తున్నాడు. T20లు ODIలలో కాకుండా టెస్ట్ క్రికెట్లో మాత్రమే సిరాజ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.