Revanth Reddy: నన్ను తప్పించండి… అధిష్టానానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
Revanth Reddy: తనను PCC అధ్యక్షుడి బాధ్యత నుంచి తప్పించాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను రిక్వెస్ట్ చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2021 జూన్ నెలలో కాంగ్రెస్ తనను PCC అధ్యక్షుడిగా నియమించిందని.. జులై 7న చార్జి తీసుకున్నానని.. ఈ ఏడాది జులై 7 నాటికి తాను పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పదవి నుంచి తనను తొలగించి సామాజిక న్యాయం చేసేలా సామర్థ్యం ఉన్న నేతకు ఆ పదవి ఇవ్వాలని కోరారు.