vizag steel plant కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఆసక్తి!
vizag: విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం కేసీఆర్(cm kcr) ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో సీఎండీ ఆదేశాల మేరకు ముగ్గురు డైరెక్టర్లు విశాఖలోని ప్లాంట్(vizag steel plant) ను ఇవాళ సందర్శిస్తున్నారు. కేసీఆర్ సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్(take over) సాధ్యాసాధ్యాలపై వారు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలో విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలని ఈ నెల 15వ తేదీన తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉందని పేర్కొంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(vizag steel plant privatization) దిశగా కేంద్రం(central government) అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ(jd lakshmi narayana) ఏపి, తెలంగాణ సర్కార్ లకు ఇటీవల కీలక సూచనలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని జేడీ కోరారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ ప్లాంట్ కొనుగోలు వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ జగన్(cm jagan) మాత్రం స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ చేసేందుకు ముందుకు రావట్లేదు. దీనికి కారణం.. స్టీల్ ప్లాంట్‌ను అదానికి కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తుండగా.. ఇప్పటికే బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలియజేస్తున్న జగన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. ఇక కేసీఆర్ ఆలోచన మాత్రం.. ఏపీలో బీఆర్ఎస్ బలంగా పాతుకుపోవాలని చూస్తున్నట్లుగా ఉంది. ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.