ఇంట్లో స్త్రీలు ఈ మాటలు మాట్లాడితే దరిద్రం వెంటాడుతుంది
Spiritual: ఇంట్లో స్త్రీలు కొన్ని రకాల మాటలు మాట్లాడకూడదు. పొరపాటున ఆ మాటలు అన్నా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుందట. చాలా మంది స్త్రీలు కోపంలో తెలీక శాపాలు పెడుతుంటారు. ఇలాంటివి పొరపాటున అనకూడదు. వాక్కు అనేది జ్యోతిష్య శాస్త్రంలో రెండో భాగంలో ఉంటుంది. దీని వల్ల భర్త ఆయుర్దాయం తగ్గిపోతుందని కూడా శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే స్త్రీ వాక్కు అమ్మవారి వాక్కుతో సమానం. అందుకే ఆడవాళ్ల చేత కన్నీరుపెట్టనివ్వకూడదు అంటారు. స్త్రీ కంటతడి పెట్టి మనసులో ఏం కోరుకున్నా అది జరుగుతుంది.