Mythology OTT Platform: భార‌త‌దేశపు తొలి ఆధ్యాత్మిక OTT.. త‌క్కువ ధ‌ర‌కే ప్లాన్స్

indias first Mythology OTT Platform launched

Mythology OTT Platform: కేవ‌లం ఆధ్యాత్మిక సినిమాలు చూడాల‌నుకునేవారికి శుభ‌వార్త‌. భార‌త‌దేశంలోనే తొలి ఆధ్యాత్మిక OTT అయిన హ‌రి ఓం ప్రారంభమైపోయింది. ఇందులో తిరుమ‌ల శ్రీవారు, చాయా గ్ర‌హ రాహు కేతు, ల‌క్ష్మీదేవి, స‌ర‌స్వ‌తి, జై జ‌గ‌న్నాథ్‌ల పేరిట ఆస‌క్తిక‌రమైన క‌థ‌ల‌ను చూపించ‌బోతున్నారు. దాదాపు 20 ఆధ్యాత్మిక క‌థ‌లు ఈ హ‌రి ఓం ఓటీటీలో వీక్షించ‌వచ్చు. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌. సంవ‌త్స‌రానికి కేవ‌లం రూ.35 క‌డితే చాలు. ఇందులో భ‌జ‌న‌లు, ప్రార్థ‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. దీంతో పాటు ప్ర‌ముఖ ఆల‌యాల్లోని హార‌తి స‌మ‌యాలు, టికెట్ బుకింగ్స్, ప్ర‌సాదాల బుకింగ్స్, విరాళాలు, ఆల‌య వార్త‌ల‌కు సంబంధించిన అన్ని అంశాలు అందుబాటులో ఉంటాయి. బూతు సినిమాలు సిరీస్‌లు చూసి విసుగెత్తిపోయిన వారికి ఇదో చ‌ల్లటి క‌బుర‌నే చెప్పాలి.